అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్|

0
0

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!

‎జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ గారు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమ్మాయిలు, యువతులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త డేటింగ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారని పేర్కొన్నారు.

‎ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఆకర్షణీయమైన పోస్టర్లతో సైబర్ క్రిమినల్స్ యువతులకు వల వేస్తున్నారని తెలిపారు. ‘1st August Special – 50% OFF’ అంటూ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారని చెప్పుకొచ్చారు. కాఫీ డేట్ – రూ.499, సినిమా డేట్ – రూ.1,249 అంటూ ప్యాకేజీలు ప్రకటించారని తెలిపారు. షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడుగా వస్తామంటూ వివిధ ధరలతో సైబర్ క్రిమినల్స్ ఆఫర్లు ఇచ్చారని వెల్లడించారు.