కుత్బుల్లాపూర్‌లో అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. షాపూర్‌నగర్‌లో నిర్వహించిన 22-A బాధితుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్లు, రుణాలు అందక వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యుడైన మంత్రిని బర్తరఫ్ చేయాలని కోరారు. సెప్టెంబర్ 7 లోగా సమస్య పరిష్కారం కాకపోతే లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.










