అన్నదానానికి రూ.లక్ష విరాళం|

0
1

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా పాల్వంచ కి చెందిన కట్టేకోలా యాదగిరి అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,000 (లక్ష రూపాయలు) విరాళంగా దేవస్థానం ఈ ఓ దామోదర్ రావు కి అందజేశారు.శ్రీ సీతారామచంద్రస్వామివారి సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అన్నదానానికి ఈ విరాళాన్ని అందించినట్లు కట్టేకోలా యాదగిరి తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరం అన్నప్రసాదం అందించేందుకు దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ఎంతో విశిష్టమైనదని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఆహారం అందించడం ద్వారా స్వామివారి సేవలో భాగస్వాములు కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఈ ఓ,అధికారులు, సిబ్బంది దాత కట్టేకోలా యాదగిరిని అభినందించారు. స్వామివారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. దాత కుటుంబ సభ్యులకు శ్రీ సీతారామచంద్రస్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా ఈ ఓ దామోదర్ రావు మాట్లాడుతూ … అన్నదాన కార్యక్రమానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నరు . మరింత మంది భక్తులు, దాతలు ముందుకు వచ్చి అన్నదాన పథకానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు సేవా స్ఫూర్తిని పెంపొందిస్తోందని తెలిపారు.