మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆగస్టు 20 నుంచి ‘కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రెండు నెలల పాటు ఉచిత శిక్షణ, పుస్తకాలు, భోజన వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఉచితంగా టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. దసరా తర్వాత దీనిని చెన్నూర్లోనూ అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారన్నది ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అపోహ మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.










