ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘జైల్ భరో’, రాస్తారోకో కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహించారు. 84వ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శ్రామిక లోకం నిరసన తెల్పింది. కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు చేపట్టిన భారీ నిరసన ర్యాలీతో రహదారులు హోరెత్తాయి. రాస్తారోకో కారణంగా ప్రధాన కూడలి వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నేతలు డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధర, వేతన పెంపు, సామాజిక భద్రత కల్పించాలని పట్టుబట్టారు. ఈ నిరసనలో IFTU, AIKMS, PDSU, CITU తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.










