మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి రాపాక బ్రహ్మచారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ములుగు జిల్లా ఇన్‌చార్జ్ జ్యోతక్క సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతక్క ఆయనకు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాపాక బ్రహ్మచారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బ్రహ్మచారి చేరికతో ఓటాయి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు యాదవ్, అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్, సీనియర్ నాయకుడు ఈసం స్వామి, ఓటాయి గ్రామ సీనియర్ నాయకులు బుగ్గల కొమురయ్య, చింత అనిల్, దయ్యాల నరేష్, కూడికల రమేష్, యూత్ అధ్యక్షుడు ఏషబోయిన త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.










