ఇస్కాదామెర్ల KVR కాలనీలో స్థల వివాదం.. న్యాయం కోసం పోరాటం|

0
1
సమస్య నేపథ్యం:
KVR కాలనీ/ఇస్కదామెర్ల గ్రామంలో గుడి లేకపోవడంతో, అమ్మవారి పొంగళ్ల నిర్వహణ కోసం ఊరి పెద్దమనిషి అన్నెం సుబ్బారెడ్డి రోడ్డు పక్కన కొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. గ్రామస్తులు అక్కడే ఏటా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.
వివాదం ఎలా మొదలైంది?:
కొందరు వ్యక్తులు ఆ స్థలం తమదేనంటూ రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేసి, ప్రజలకు రోడ్డు లేకుండా చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారు వచ్చి వెళ్లారే తప్ప, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
గ్రామ ప్రజలు విజ్ఞప్తి:
అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, గ్రామ సంప్రదాయ వేడుకలకు ఆటంకం కలగకుండా చూడాలని కోరుతున్నారు.
గ్రామ ప్రజలు డిమాండ్లు:
  • స్థల వివాదంపై అధికారులు తక్షణమే విచారణ జరపాలి.
  • సంప్రదాయ పొంగళ్ల నిర్వహణకు అనుమతి ఇవ్వాలి.
  • రాత్రిపూట అక్రమంగా ఫెన్సింగ్ వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  • గ్రామస్తుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా శాంతి నెలకొల్పాలి.
గమనిక: తమకు న్యాయం చేసి, సంప్రదాయాలను కాపాడేలా అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.