🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)
ఆసిఫాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధికార పక్షాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. మూడేళ్లుగా కేవలం శంకుస్థాపనలు మాత్రమే జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు ఎక్కడ జరిగాయో చూపించాలని సవాల్ విసిరారు. 3,500 ఇళ్లలో ఎన్ని పూర్తయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్మాన్ పథకం నిధులతో నిర్మిస్తున్న ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. వట్టివాగు ప్రాజెక్టు నీటి విడుదల కోసం రైతులతో కలిసి తాను చేపట్టిన ఆందోళనను గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు తనకు అండగా ఉన్నారని కోవ లక్ష్మి తెలిపారు. అధికార పక్షం అభివృద్ధి పనులపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె కోరారు.










