కనుమ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం|

0
3

మదనపల్లె: కనుమలోని గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబును ఘనంగా సన్మానించి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు శ్రీరామ్ చినబాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

 

ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ గుట్ట వెంకటరమణ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

 

గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఆలయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. శనివారం నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని శ్రీరామ్ చినబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తెలుగు యువత నాయకులు, యుగంధర్ ( పార్థ), గురు, విక్రమ్,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.