కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన మహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మన మొక్కలు – మన భవిష్యత్తు మరియు మొక్కలు నాటుదాం – ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టుదాం అనే నినాదాలతో ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్ లతో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి, ఇతర ఉన్నతాధికారులు ముమ్మరంగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి మరియు వర్షపు నీటిని సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ, పోలీస్ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










