🎤ఆసిఫాబాద్ ఆగస్టు 25 (భారత్ ఆవాజ్): ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ ఏకంకర్ వినోద్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్ బోయ్, హేమాజీ ఏవులే, దారుంబయ్ ఏవులే, రావు జీ బోయిరే, బాబురావు బోయిరే, వినోద్ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










