ఏరువాడ గిరిజనకు రూ.10 కోట్ల నిధులు మంజూరు|

0
4

చింతూరు మండలం మారుమూల ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, తాగునీరు, పాఠశాల వసతుల కల్పన కోసం సుమారు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. గ్రామస్తులు పంపిన వీడియోల ద్వారా సమస్యలను తెలుసుకున్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఆ వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఈ అభివృద్ధి పనుల పట్ల గిరిజనులు, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

# Yadagiri