Madanapalle: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి హోదాల్లో ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బైక్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారణాసికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ యువ నాయకుడు మిట్టా వంశీకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులు సింహం శ్రీకాంత్, టీచర్ల తదితరులు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు.










