ఏపీలో భారీ వర్షాలు .. ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.

0
1

 

ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

6 జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు

తీవ్ర తుఫానుగా బలపడిన వాయుగుండం

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సూచన

భారీ వర్షాలు, తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 23) సెలవు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా యంత్రాంగాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఈ రోజు రాత్రికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మధ్య, విశాఖపట్నం-గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.