అర్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

0
0

రోలుగుంట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రోలుగుంట మండలం అర్లా గ్రామంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. బుచ్చింపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది సహకారంతో రోలుగుంట మండల బీజేపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిముడు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో బుచ్చింపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బందితో పాటు రోలుగుంట మండల బీజేపీ అధ్యక్షుడు జి. సాంబశివరావు, హెల్త్ అసిస్టెంట్ హరి, వైద్య సిబ్బంది పార్వతమ్మ, ఆశ వర్కర్ దేవుడమ్మ, అంగన్వాడి టీచర్ వరలక్ష్మి, అర్ల గ్రామ పెద్దలు, పాడి నూకరాజు, పాడి సన్యాసిరావు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.