ఉద్యమకారుల హామీల అమలుకు.. 8వ రోజూ దీక్ష.|

0
2

• 8వ రోజుకు చేరుకున్న అల్వాల్ జేఏసీ రిలే నిరాహార దీక్షలు

• దీక్షను ప్రారంభించిన హైదరాబాద్ జేఏసీ చైర్మన్ శ్రీధర్

• ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్

అల్వాల్, సెప్టెంబర్ 24: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. 

అల్వాల్ జేఏసీ చైర్మన్ పాటోళ్ల సురేందర్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న దీక్షా కార్యక్రమాన్ని మాజీ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, హైదరాబాద్ జేఏసీ చైర్మన్ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

రిలే నిరాహార దీక్షలో ముత్యాలు, అనిల్ రాజ్, పి. రాజు, సత్తయ్య పాల్గొని దీక్ష చేపట్టారు.

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు.

కార్యక్రమంలో పుట్నాల కృష్ణ, ఏ.డి. దయాకర్, డోలి సుధీర్, శేరుపల్లి మల్లేష్, జానకి రెడ్డి, సతీష్, నగేష్ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు.

#Sidhumaroju

Alwal