విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఎన్డీయే కూటమి సమన్వయ సమావేశం – పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు

0
1

నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం కూటమి పక్షాల (టీడీపీ, జనసేన, బీజేపీ) ముఖ్య సమన్వయ సమావేశం ఘనంగా జరిగింది. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జీవీఎంసీ ఎన్నికల టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కీలక భేటీలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విశాఖపట్నం అభివృద్ధి, జీవీఎంసీ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం, మరియు రాబోయే ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై విస్తృతంగా చర్చించారు.

ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కూటమి శ్రేణులు క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేసి ప్రజా సంక్షేమానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.