కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం కరాటే బెల్ట్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. మహిరా షోటోఖాన్ కరాటే డో ఇండియా, యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా శ్రీ సత్యసాయి జిల్లా స్టైల్ చీఫ్, 5వ డాన్ బ్లాక్ బెల్ట్ మాస్టర్ షాకీర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి.విద్యార్థులకు వార్మప్స్, సిట్అప్స్, పంచెస్, బ్లాక్స్, కిక్స్, స్టాండ్స్, కటాస్, కుమితే తదితర అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. కరాటే ద్వారా ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందుతాయని మాస్టర్ షాకీర్ తెలిపారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కరాటే ద్వారా భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో అవకాశాలు పొందవచ్చని విద్యార్థులకు వివరించారు.ఈ పరీక్షల్లో మొత్తం 19 మంది విద్యార్థులు వివిధ బెల్ట్లలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మాస్టర్ షాకీర్ చేతుల మీదుగా బెల్ట్లు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కరాటే కోచ్ రంజిత్, సీనియర్ బ్లాక్ బెల్ట్ విద్యార్థులు మహమ్మద్ కైఫ్, రీదా ముస్కాన్, రోషిని, రబ్బన్, రెహన్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు








