ఫుడ్ సేఫ్టీ నోటీసులు.. వార్తలకే పరిమితమా.|

0
9

● రెండు డ్రైవ్‌ల్లో 19 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులు సస్పెండ్

● కిచెన్లలో అపరిశుభ్రత.. పాడైన, గడువు ముగిసిన ఆహార పదార్థాలు

● పక్వాన్ గ్రాండ్‌లో 1,170 కిలోల గడువు ముగిసిన బియ్యం

● లైసెన్సుల సస్పెన్షన్ తర్వాత కూడా కార్యకలాపాలపై ప్రశ్నలు

అల్వాల్, సెప్టెంబర్ 27: హైదరాబాద్‌లో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలపై TG SAFE అధికారులు వరుస తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు ప్రత్యేక డ్రైవ్‌ల్లో 19 రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి, కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.

సెప్టెంబర్ 24న 15 ఆహార సంస్థలను పరిశీలించి 16 నమూనాలు సేకరించారు. ఎనిమిది సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా నడుస్తున్న మరో సంస్థను మూసివేశారు.

రైడుర్గ్‌లోని పక్వాన్ గ్రాండ్‌లో 1,170 కిలోల గడువు ముగిసిన బియ్యంతో పాటు నాణ్యత లోపాలున్న 45 కిలోల నూడుల్స్, పాడైన గుడ్లు గుర్తించారు. కిచెన్‌లో ఎలుకల ఆనవాళ్లు, అపరిశుభ్రత, తుప్పుపట్టిన రిఫ్రిజిరేటర్లు కూడా బయటపడ్డాయి.

సెప్టెంబర్ 26న మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో 10 బృందాలతో తనిఖీలు చేపట్టారు. మొత్తం 20 ఆహార సంస్థలను పరిశీలించి 21 నమూనాలు సేకరించారు.

శివాని ది రెస్టారెంట్ & బార్, అల్ సబా రెస్టారెంట్, లక్కీ మల్టీక్యూసిన్ రెస్టారెంట్, సాయి రామ్ మెస్, ఉడిపీస్ ఉపహార్, కోల్ స్పార్క్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్, కంచి కేఫ్, అంతేరా కిచెన్ & బార్, ఆమ్ ఆహా తెలుగు కిచెన్ & బార్, ఫ్యూజన్ 9/అమ్నీషియా స్కై బార్, మోనాస్టరీ సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్‌తో పాటు సంబంధిత సంస్థలు వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో రమేశ్వరం కేఫ్, ఇష్టా, సహిబ్స్ బార్బెక్యూ, పక్కా లోకల్, హోటల్ షాదాబ్, షా గౌస్ హోటల్ అండ్ రెస్టారెంట్‌లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. 63 డిగ్రీస్ మోడ్రన్ రీజినల్ బఫే, మినర్వా గ్రాండ్, హోటల్ అవాసాకు షోకాజ్ నోటీసులు అందజేశారు.

ఆహార సంస్థలపై వరుస చర్యలు కొనసాగుతున్నప్పటికీ, సస్పెన్షన్ ఆదేశాలు ఎంత మేరకు అమలవుతున్నాయనే అంశం చర్చనీయాంశం అయ్యింది . 

లైసెన్స్ నిలిపివేసిన తర్వాత కూడా ఏదైనా సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తే, సంబంధిత అధికార యంత్రాంగం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.

#Sidhumaroju

Alwal