భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి :, కదిరి తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కదిరి మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తహసీల్దార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో వీఆర్ఏలు చేపడుతున్న సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా, రేపటి నుంచి కదిరి మండలంలోని వీఆర్ఏలు కూడా ఉద్యమంలో పాల్గొంటారని తహసీల్దార్‌కు తెలిపారు.ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న తరహాలో పే స్కేలు కల్పించాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. అలాగే అటెండర్, వాచ్మాన్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని, ప్రమోషన్ కోటాను 30 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. నామినల్ వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ గ్రామ రెవెన్యూ సహాయకులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు.తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని తహసీల్దార్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల కదిరి మండల అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, చంద్రశేఖర్, కృష్ణమ్మ, నరసింహులు, నాగభూషణం, వెంకటేష్, గంగాధర, పవన్ తదితరులు పాల్గొన్నారు.










