మందమర్రి పట్టణంలో ఆదివారం ఆర్గనైజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ కరాటే పోటీల్లో మందమర్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడి పలు బహుమతులు సాధించారు. విజేతలకు పట్టణ ఎస్సై నరేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, క్రీడల్లో రాణించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్‌లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.










