నస్పూర్ గేటు వద్ద గోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

0
3

మంచిర్యాల జిల్లా: నస్పూర్ గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ–ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాదంలో మృతిచెందిన వారిలో మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన వారు ఉన్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది. మృతుల్లో సౌందర్య, చింతకుంట లక్ష్మి పేర్లు వినిపిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వారి పరిస్థితిపై వైద్యుల నుంచి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న వారే?

ప్రమాదానికి గురైన వారంతా మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. రోజువారీ పనులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదానికి కారణం ఏమిటి?

నస్పూర్ గేటు వద్ద లారీ–ఆటో ఢీకొనడానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అతివేగమా.. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యమా.. లేక రహదారి పరిస్థితులా? అనే కోణాల్లో ప్రమాద కారణాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది