సూర్యమోహన్ మద్దూర్ మండల్
మద్దూర్ పట్టణంలో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నివాసాలను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా కనీసం ఇంట్లోని సామాగ్రిని సర్దుకునే గడువు కూడా ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడ్డారని స్థానిక బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలంగాణలో
బుల్డోజర్ రాజ్యం తెచ్చిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పేద ప్రజల గూడును కూల్చడం కాదని వారి సమస్యలను పరిష్కరించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు అన్యాయంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి న్యాయం చేయాలని లేనిపక్షంలో బాధితులకు అండగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు










