*ప్రభుత్వ పథకాల ఎంపికపై ఆరోపణలు.. మాజీ నేత తీరుపై కాంగ్రెస్‌లోనే చర్చ?*
**కూకట్‌పల్లి:** ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలన’కు ప్రాధాన్యం ఇస్తున్న వేళ.. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికపై వస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
*600 లబ్ధిదారుల ఎంపికలో అంతా తానై నిర్ణయం తీసుకున్న వైనం*
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నిబంధనల ప్రకారం అధికారులు ఎంపిక చేయాల్సి ఉండగా.. రాజకీయ జోక్యం, సిఫారసులు, అక్రమ వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. **అధికార వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థకు మధ్య ఉండాల్సిన ‘లక్ష్మణరేఖ’ ఎక్కడ?** అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
*మాజీ నేత తీరుపై ఆరోపణలు*
గతంలో కీలక పదవిలో ఉన్న ఓ మాజీ నేత కారణంగా ప్రభుత్వ పథకాల ఎంపిక ప్రక్రియపై అనుమానాలు ఏర్పడుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపిక చేయాల్సిన లిస్టు అతని చేతికి ఎలా వచ్చింది ఈ ఎంపిక ప్రక్రియలో అతనికి సహాయం చేసింది ఎవరు. ఒక ప్రైవేటు గృహంలో పథకాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని వైస్ చైర్మన్ ఎలా నిర్వహిస్తారు.
*ప్రజా పాలనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా?*
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం, రేవంత్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాంటి ప్రజా విశ్వాసానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో వినిపిస్తే.. అది పార్టీకి స్థానికంగా నష్టం కలిగించే అంశంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
*కాంగ్రెస్‌కు తీరని నష్టమా?**
ఒక వ్యక్తి తీరుతో మొత్తం పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదంటే ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అర్హత, నిబంధనలే ప్రాతిపదిక కావాలని పలువురు కోరుతున్నారు. *లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా వెల్లడించి ఆరోపణలకు తెరదించాల్సిన బాధ్యత అధికారులదే*.
కూకట్పల్లి నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమ వసూళ్ల ఆరోపణలు, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉందా? మాజీ నేత పాత్ర ఏమిటి అన్న అంశాలపై సంబంధిత అధికారులు, పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.









