సింగరేణి బకాయిలపై బీజేపీ ధర్నా.. కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆందోళన
సింగరేణి బకాయిలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబల్లి రఘునాథ్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే ఏ. శ్రీదేవి, అరిగెల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సింగరేణి కార్మికుల తరఫున ప్రధానంగా ఈ 7 డిమాండ్లను ప్రస్తావించారు. రూ.55,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలి. 2025–26 వార్షిక లాభాలను ప్రకటించి 40% వాటాను కార్మికులకు ఇవ్వాలి. ప్రతి నెల 3 మెడికల్ బోర్డులు నిర్వహించి న్యాయం చేయాలి. కార్మికులకు 2 గుంటల స్థలం + బ్యాంకు రుణంతో సొంత ఇంటి పథకం అమలు చేయాలి. నాణ్యమైన పనిముట్లు, రక్షణ (సేఫ్టీ) పరికరాలను సకాలంలో అందించాలి. డిస్మిస్ అయిన అర్హులైన కార్మికులకు పునరావకాశం కల్పించాలి.
కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ నిర్ణయాలు, ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










