🎤ఆసిఫాబాద్, ప్రతినిధి (భారత్ ఆవాజ్ న్యూస్ ): ఆసిఫాబాద్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) శ్యామ్‌రావు గారు ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ (Superintendent of Police) గారి చేతుల మీదుగా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు ప్రజా సేవలో నిరంతరం ముందున్న శ్యామ్‌రావు గారి ఉత్తమ విధి నిర్వహణను జిల్లా ఎస్పీ గారు ఈ సందర్భంగా కొనియాడారు.
ఆయన సేవలను అభినందిస్తూ జిల్లా ఎస్పీ గారు శ్యామ్‌రావు గారికి శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేసి బహుమతిని అందజేశారు. పదవీ విరమణ తర్వాత ఆయన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.










