రోలుగుంట పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిన్లాండ్ విద్యా విధానంపై తల్లిదండ్రులు, ఎస్ఎంసి చైర్మన్, సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత, ఫిన్లాండ్ విద్యా పర్యటన చేసిన ఉపాధ్యాయిని పి.వి.ఎం. నాగజ్యోతి ఈ కార్యక్రమంలో ఫిన్లాండ్ లో తాను ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, తరగతి గది కార్యకలాపాలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను తల్లిదండ్రులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.ఫిన్లాండ్ విద్యా విధానంలో విద్యార్థి కేంద్రిత బోధన, అనుభవాత్మక అభ్యసనం, కార్యకలాపాల ఆధారిత బోధన, సృజనాత్మక ఆలోచన, ఆచరణాత్మక నైపుణ్యాల అభివృద్ధి, విద్యార్థుల ఆనందం, ఆత్మవిశ్వాసానికి ఇచ్చే ప్రాధాన్యత వంటి అంశాలను వివరించారు. అదే విధంగా తమ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆంగ్ల భాషా బోధన, తరగతి గదిలో విషయాలను అర్థమయ్యేలా బోధిస్తున్న విధానం, వివిధ బోధనా పద్ధతుల గురించి తెలిపారు. విద్యార్థులలో భాషా నైపుణ్యాలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు నిర్వహిస్తున్న కో కరిక్యులర్ యాక్టివిటీస్, నో బ్యాగ్ డే కార్యకలాపాలను వివరించారు.పాఠశాలలో అందుబాటులో ఉన్న తరగతి గదులు, డిజిటల్ అభ్యసన సదుపాయాలు, గ్రంథాలయం, విద్యా సామగ్రి, క్రీడా మరియు ఇతర మౌలిక వసతుల గురించి కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఫిన్లాండ్ లో చూసిన విద్యా విధానాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలో అమలు చేస్తున్న విధానాన్ని ఫొటోలు, వీడియోల ద్వారా చూపించడంతో తల్లిదండ్రులు, ఎస్ఎంసి సభ్యులు ఆసక్తిగా వీక్షించారు.
Home Andhra Pradesh రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిన్లాన్ విద్యా విధానంపై తల్లిదండ్రులకు అవగాహన










