● నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష
● సైబర్ నేరాలు, సీసీటీవీ నిఘా, ప్రివెంటివ్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
● పెండింగ్ కేసుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశం
అల్వాల్, అక్టోబర్ 1: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో నేర పరిస్థితులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, పోలీసింగ్ పనితీరుపై కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి, ఐపీఎస్ నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
కమిషనరేట్ పరిధిలో నేరాల గుర్తింపు, కేసుల దర్యాప్తు నాణ్యత, నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు అంశాలు, సైబర్ నేరాల నియంత్రణ, సీసీటీవీ నిఘా, ముందస్తు నేర నియంత్రణ చర్యలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమావేశంలో సమీక్షించారు.
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వాటి దర్యాప్తు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సీపీ సూచించారు.
క్షేత్రస్థాయిలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై సకాలంలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
#Sidhumaroju
Alwal










