అర్హత లేదు.. వైద్యం ఆపలేదు.|

0
3

● మల్కాజిగిరి SOT ఆకస్మిక తనిఖీలు

● కీసర, జవహర్‌నగర్, గోపాలపురం, మార్కెట్ PS పరిధుల్లో క్లినిక్‌లు, ఫస్ట్‌ఎయిడ్ కేంద్రాల పరిశీలన

● మందులు, వైద్య పరికరాలు స్వాధీనం

అల్వాల్, అక్టోబర్ 1: అవసరమైన వైద్య విద్యార్హతలు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలపై మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) నలుగురిని అదుపులోకి తీసుకుంది. 

కీసర, జవహర్‌నగర్, గోపాలపురం, మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లోని ఫస్ట్‌ఎయిడ్ కేంద్రాలు, క్లినిక్‌లపై SOT బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

పోలీసులకు అందిన సమాచారంతో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, అవసరమైన వైద్య అర్హతలు, అనుమతులు లేకుండానే వైద్యులుగా వ్యవహరిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న నలుగురిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

తనిఖీల సందర్భంగా క్లినిక్‌లు, ఫస్ట్‌ఎయిడ్ కేంద్రాల నుంచి మందులు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో అర్హతలు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించే వారిపై నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

#Sidhumaroju

Alwal