అహింసా మార్గం ప్రపంచానికి ఆదర్శం: మాజీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు

0
1

గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు నందిగామలో ఘనంగా

నందిగామ, అక్టోబర్ 2, భారత్ అవాజ్ : నందిగామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పట్టణంలోని గాంధీ సెంటర్‌లో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముందుగా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో, అనంతరం గాంధీ సెంటర్‌లోని మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి విగ్రహాలు, చిత్రపటాలకు జగన్మోహనరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, శాంతియుత పోరాటం నేటికీ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ‘జై జవాన్‌–జై కిసాన్‌’ నినాదంతో దేశ సమగ్రత, రైతు సంక్షేమానికి లాల్‌బహదూర్ శాస్త్రి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు, ప్రజాసేవకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహనీయులకు నివాళులర్పించారు.