బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు శుక్రవారం మాజీ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీనుతో ఆత్మీయంగా ముచ్చటించి, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్రతోనూ మాట్లాడారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు వారు తెలిపారు.
#RAJESH







