ఆసిఫాబాద్ రైతులకు ముఖ్య గమనిక తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదు చేసుకోవాలి – వ్యవసాయ సహాయ సంచాలకులు మిలింద్

0
1

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ పరిధిలోని రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ (Farmer Registry) నమోదు చేసుకోవాలని ఆసిఫాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు మిలింద్ ఒక ప్రకటనలో కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఎరువులు, విత్తనాలు, అలాగే వరి, కంది, పత్తి వంటి పంటల కొనుగోళ్లను ఈ రిజిస్ట్రీతోనే అనుసంధానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నమోదుకు కావలసిన పత్రాలు:

• పట్టాదారు పాస్‌బుక్

• ఆధార్ కార్డ్

• ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్

రైతులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రం లేదా ఏఈఓ ను సంప్రదించి, మొబైల్‌కు వచ్చే ఓటీపీ  ద్వారా తమ పేర్లను వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.