వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ మున్సిపల్ కార్మికులకు బతుకమ్మ దసరా పండగల సందర్భంగా అందించాల్సిన బోనస్ పెండింగ్ వేతనాలను మరియు ఇతర పండగ కానుకలు తక్షణ అందించాలని వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, కౌన్సిలర్ కుమ్మరి శంకర్, ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మరియు బిజెపి నాయకులు పాల్గొని మున్సిపల్ యంత్రంగం వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వేములవాడ పట్టణ పుణ్యక్షేత్రంలో ఏ వి ఐ పి పర్యటన ఉన్న లేదా వీధులన్నీ వార్డు లను శుభ్రంగా ఉంచాలన్నా పారిశుద్ధ్య కార్మికులే కీలకపాత్ర పోషిస్తారని నాయకులు గుర్తుచేశారు ప్రతి రోజు వీధులని శుభ్రం చేస్తూ ప్రజ ఆరోగ్యంని కాపాడే పారిశుద్ధ్య కార్మికులు ఒక్కరోజు పని చేయకపోతే పట్టణమంతా కంపు కొడుతుందని అలాంటి కార్మికుల సంక్షేమంన్ని మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం సిగ్గుచేటని విమర్శించారు గత నెల జూలై నుంచి నేటి వరకు కార్మికులకు రావలసిన వేతనాలను నిలిపివేని వారి పొట్ట కొడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రతిఏటా దసరా పండుగ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు అందించే బట్టలు చెప్పుల జతలు నూనె సబ్బులు సర్ఫ్లు వంటి నిత్యవసర కానుకలను గత ఏడాది నుండి ఈ ఏడాది వరకు కూడా అందించడంలో మున్సిపల్ అధికారులు ధారణంగా విఫలమయ్యారని ఆరోపించారు
హిందువులకు అత్యంత పెద్ద పండుగలు అయినా బతకమ్మ దసరా సమయంలో కూడా జీతాలు బోనస్ అందివ్వకపోవడంతో పారిశుద్ధ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వేములవాడ బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పండగ ఖర్చులకోసం కుటుంబ పోషణ కోసం బయట రూ.5, రూ 10 అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితికి కార్మికులను నెట్టారని పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కార్మికులందరికీ భీమా సౌకర్యం కల్పించాలని తీర్మానాలు చేసినప్పటికీ అమలులో మాత్రం పక్షపాతం చూపిస్తున్నారని మండిపడ్డారు ఔట్సోర్సింగ్ కార్మికులతో సహా మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులందరినీ సమానంగా చూడాలని అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు
స్థానిక ఎమ్మెల్యే నిధుల నుంచి గాని మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి గాని తక్షణమే నిధులు సర్దుబాటు చేసి మరో రెండు లేదా మూడు రోజుల్లో పరిశుద్ధ కార్మికుల పెండింగ్ జీతాలు దసరా బోనస్ రావాల్సిన కానుకలు అన్నిటిని పూర్తిస్థాయిలో విడుదల చేయాలని స్పష్టం చేశారు ఒకవేళ అధికారులు స్పందించకపోతే బతుకమ్మ దసరా పండగ రోజుల్లోనే బిజెపి కౌన్సిలర్లు మరియు నాయకత్వం ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులను మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో వేములవాడ పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు










