శభాష్ గాయత్రీ.. మీ సహృదయానికి వందనాలు: సీఎం చంద్రబాబు.

0
1

మానవత్వ పరిమళం వెల్లివిరిసిన ఒక అపురూప ఘటనకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రశంసలు లభించాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన కేంద్రంలో పనిచేస్తున్న గాయత్రి అనే మహిళా ఉద్యోగినిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. చేతులు లేని దివ్యాంగ భక్తుడికి ఆప్యాయంగా అన్నం తినిపించి ఆమె చూపిన సహృదయానికి ‘శభాష్ గాయత్రీ’ అంటూ అభినందించారు.