బోయకొండ గంగమ్మ సన్నిధిలో ఘనంగా వరుణయాగం

0
1

పుంగనూరు – అక్టోబర్ 06 : చౌడేపల్లి మండలం దిగువపల్లి లో వెలసియున్న ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవాలయంలో వరుణయాగాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని చేపట్టారుద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల నడుమ వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు యాగ క్రతువులను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు# కొత్తూరు మురళి.