కష్టాలలో పారిశుద్ధ్య కార్మికులు ఖాదర్ చేయూత

0
1

భారత్ ఆవాజ్ న్యూస్  :నల్లచెరువు మండలంలో కార్మికులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తమ సమస్యను మాజీ జడ్పీటీసీ అబ్దుల్ ఖాదర్ దృష్టికి తీసుకెళ్లారు. జీతాలు అందిన వెంటనే డబ్బులు తిరిగి చెల్లిస్తామని కార్మికులు తెలపగా, వారి ఇబ్బందులను అర్థం చేసుకున్న అబ్దుల్ ఖాదర్ మానవతా దృక్పథంతో రూ.65 వేల ఆర్థిక సహాయం అందించారు.జీతాలు వచ్చిన అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి అందించాలని ఆయన కార్మికులను కోరారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన అబ్దుల్ ఖాదర్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కుమారుడు షరీఫ్, ప్రసాదు, రియాజ్, వానిల్లిబావ, ఎం. భాష తదితరులు పాల్గొన్నారు.