తెనాలి నగర అభివృద్ధిలో భాగంగా పాత మున్సిపల్ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. దశాబ్దాల పాటు ఎందరో అధికారులు, ఉద్యోగులు, ఈ ప్రాంగణం నుంచి ప్రజలకు సేవలు అందించారు.ఎన్నో కీలక నిర్ణయాలకు భవనం వేదికయింది.మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వసతులతో తెనాలి కొత్త మున్సిపల్ భవనం కోసం పాత భవనానికి వీడ్కోలు పలుకుతున్నారు. భవనం కనుమరుగవుతున్న జ్ఞాపకాలు ప్రజల, అధికారుల, ఉద్యోగుల, గుండెల్లో పదిలంగా ఉంటాయని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.










