తెనాలి పట్టణం లోని 23వ వార్డులో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యు పి హెచ్‌సి, c సి రోడ్డును గురువారం ప్రారంభించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్యం, రవాణా వసతుల కల్పించుట యే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సదుపాయాలతో తమ సమస్యలు తీరుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










