పేదల వైద్యానికి CMRF భరోసా

0
1

భారత్ అవాజ్ న్యూస్ : కదిరి నియోజకవర్గం పేద కుటుంబాలకు అనారోగ్య చికిత్స ఖర్చులు ఆర్థిక భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.కదిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.21,21,130 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ CMRF ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.కదిరి నియోజకవర్గంలో ఇప్పటివరకు 708 మంది లబ్ధిదారులకు రూ.6,16,67,953 విలువైన CMRF చెక్కులు అందించినట్లు వెల్లడించారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో CMRF సహాయాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.