విశాఖ పశ్చిమం అచ్చినాయుడు తోట టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తాళాల అందజేత — ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు

0
1

విశాఖ పశ్చిమం అచ్చినాయుడు తోట టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు తాళాల అందజేత — ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు

 

• పూర్తి మౌలిక వసతులతోనే లబ్ధిదారులకు గృహ ప్రవేశం

• A-1 నుండి A-25, C-12 బ్లాకులలోని సుమారు 942 ఇళ్ల తాళాలు అందజేత

• రూ. 13 కోట్లతో అప్రోచ్ రోడ్డు, విద్యుత్, తాగునీటి సౌకర్యాల కల్పన

 

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అచ్చినాయుడు లోవలో నిర్మించిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు కరెంట్, తాగునీరు, రోడ్లు తదితర పూర్తి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు శనివారం ఘనంగా తాళాలు అందజేశారు. A-1 నుండి A-25 మరియు C-12 బ్లాకులకు చెందిన దాదాపు 942 మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు గారు మాట్లాడుతూ:

• గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజం: పేదలకు హుద్‌హుద్ వంటి పెను తుఫానులు వచ్చినా తట్టుకునేలా నాణ్యమైన పక్కా ఇళ్లు నిర్మించాలనేది కూటమి ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసి, తాగునీరు, విద్యుత్, సరైన రహదారులు వంటి కనీస వసతులు కల్పించకుండా కేవలం రంగులు వేసి తూతూమంత్రంగా గృహ ప్రవేశాలు చేయించి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు.

• మౌలిక సదుపాయాల కల్పన: తాము అధికారంలోకి రాగానే లబ్ధిదారుల ఇబ్బందులను గుర్తించి వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టామన్నారు. ఈ కాలనీ కోసమే ప్రత్యేకంగా ₹33/11 KV సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను, గాజువాక లైన్ నుండి రిజర్వాయర్లు, పైప్‌లైన్ల ద్వారా తాగునీటి కనెక్షన్లను సిద్ధం చేశామని తెలిపారు.

• రూ. 13 కోట్లతో రోడ్డు & ఆర్టీసీ బస్సు సౌకర్యం: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ₹13 కోట్లు మంజూరు చేయించామని, కాలనీకి అనుసంధానంగా నిర్మిస్తున్న రోడ్డు పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. రహదారి పూర్తయిన వెంటనే మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

• భవిష్యత్ సౌకర్యాలు : కాలనీ వాసుల కోసం అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల (1 నుండి 5వ తరగతి), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), రేషన్ డిపో మరియు పోలీస్ ఔట్‌పోస్టులను కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

• లబ్ధిదారులకు విజ్ఞప్తి: ఈ భవనాలు షీర్ వాల్ టెక్నాలజీతో కూడిన దృఢమైన కాంక్రీట్ నిర్మాణాలని, కాబట్టి ఎలాంటి అంతర్గత మార్పులు (ఆల్టరేషన్లు) చేసి గోడలను పాడుచేయవద్దని లబ్ధిదారులకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిడ్కో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు