బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం: మంత్రి కొండపల్లి

0
3

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. సుప్రీంకోర్టులో సమస్యలు ఎదురైనా బీసీలకు న్యాయం చేసేందుకు అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు.

#RAJESH