శ్రామిక్ నగర్ డ్రైనేజీ సమస్య.. రామాలయ వీధి రోడ్డు సమస్య!
గత కొంతకాలంగా శ్రామిక్ నగర్ గూడెంలో డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం, అదేవిధంగా రామాలయ వీధిలో రోడ్డు నిర్మాణం కోసం ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తున్నాం.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఎంతో కష్టపడి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, సంబంధిత రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను తీసుకొచ్చి, అవసరమైన సంతకాలు చేయించి, పనులు ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు అడ్డంకులు సృష్టించడం బాధాకరం.
ఇది మొదటిసారి కాదు.. రెండోసారి జరుగుతున్న పరిణామం!
శ్రామిక్ నగర్ గూడెంలో: డ్రైనేజీ పనుల కోసం కొలతలు తీసుకుంటున్న సమయంలో పనులను ఆపడం జరిగింది.
రామాలయ వీధిలో: గతంలో రామాలయం గుడికి సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కూడా పనులను ఆపడం జరిగింది.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న సమయంలో అడ్డంకులు సృష్టించడం వల్ల చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలే.
రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలి. అభివృద్ధి పనులకు అడ్డంకులు కాకుండా, ప్రజలకు ఉపయోగపడే పనులు ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ పని విషయంలో నాకు పేరు రాకున్నా సరే కనీసం వర్క్ అయిన తర్వాత చూడగలరు ఎందుకంటే నేను పేరు కోసం పనిచేస్తుంది నేను ఈ పని కోసం ఎంత తిరిగి ఎంత కష్టపడ్డాను అందరికి తెలుసు
ప్రజల కోసం మా పోరాటం ఆగదు.. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని యాదల నరేష్
5వ డివిజన్ కార్పొరేటర్ అన్నారు.










