కోదాడ: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటుతూ ప్రెస్ క్లబ్ కోదాడ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ జీవనోపాధికి దూరమైన ఓ నిరుపేద వ్యక్తికి నిత్యావసర సరుకులు అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
కోదాడ పట్టణంలోని నయానగర్ 15వ వార్డుకు చెందిన షేక్ మన్నాన్ కాళ్లకు గాయాలై, ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో పనులకు వెళ్లలేక కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన దీనస్థితిని తెలుసుకున్న ప్రెస్ క్లబ్ కోదాడ సభ్యులు స్పందించారు. తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులను అందజేసి ఆయనకు అండగా నిలిచారు.ఈ సేవా కార్యక్రమానికి కాసారపు కృష్ణ (చందు మొబైల్స్), ఎం.డీ. రహీమ్, షేక్ నూరుద్దీన్ నిత్యావసర సరుకులను అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలకు ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి, గౌరవ సలహాదారు వీరాంజనేయులు, సభ్యులు బానాల అబ్రహాం, జగన్ మోహన్ రావు, షేక్ నూరుద్దీన్, ఉపేందర్, జి. మోహన్, ఏ. వెంకటేశ్వరులు, గోపీచంద్, ఎం.డీ. రహీమ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.










