చింతూరులో ఆందోళన, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బొమ్మ దగ్ధం!

0
3

ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఓటు హక్కును పరిహాసం చేసిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరులో సిపిఎం కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పల్లపు వెంకట్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అహ్మద్ అలీ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ అత్యంత కీలకమైనది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన పౌరుల పేర్లు తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కమిషన్ లో వ్యవహరించిన తీరు పూర్తి బాధ్యత రాహిత్యం. కేవలం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి లాభం కూర్చే విధంగా వ్యవహరించి కమిషన్ సభ్యుల అభ్యంతరాలను కూడా పరిగణంలోకి తీసుకోకుండా వంటేద్దు పోకడలకు పోయిన జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత విద్యార్థులు ప్రజాస్వామ్యవాదులు పోరాడుతున్నారు.ఆందోళనకారులు డిమాండ్ పరిగణలో తీసుకోకుండా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నిర్బంధాలను ఉపయోగించి నియంత పాలన చేయాలని చూస్తుంది.ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనకారులపైన పోర్స్ ని ఉపయోగించి అరెస్టులు చేయడమే కాకుండా రైలు రద్దు చేయడం, మెట్రో స్టేషన్లు బందు చేయడం, ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేయడం, హోటల్లు బందు చేయడం లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడింది. తక్షణమే రాష్ట్రపతి, ఉన్నత న్యాయస్థానాలు జ్యోతిష్యం చేసుకొని ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేయడం పౌరుల హక్కుగా గుర్తించి అక్రమాలకు పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సీసం సురేష్, చింతా రాంబాబు, రాజేష్, పెద్ద రాములు, లక్ష్మయ్య, సంతోష్, రవీంద్ర కాంగ్రెస్ నాయకులు జవహర్, నరేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri