● భర్తను యాక్సిడెంట్‌లో చంపించి తనపైనే నిందలు వేయిస్తానని టీమ్ సాయి హెచ్చరించినట్లు పద్మిని వెల్లడి
● పిల్లలను అనాథలుగా చేసి బొంబాయి ఫుట్‌పాత్‌పై భిక్షాటన చేయిస్తానని బెదిరింపు
● టీమ్ సాయి నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు.. అప్పులిచ్చిన వారితోనూ బెదిరింపులు
● 24/7 పార్టీ కోసం పనిచేస్తున్నా.. సేవలను గుర్తించి పదవి అప్పగించిన బీజేపీ
● బీజేపీ నిజనిర్ధారణ కమిటీకి వివరాలు.. పార్టీ చెప్పినా కేసు ఉపసంహరించుకోనని స్పష్టీకరణ
అల్వాల్, అక్టోబర్ 11: తాను చెప్పినట్లు వినకపోతే తన భర్తను యాక్సిడెంట్‌లో చంపించి, ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తితోనే తనకు అక్రమ సంబంధం ఉందని, తమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని, అందుకే పద్మినే యాక్సిడెంట్ చేయించిందని చెప్పిస్తానంటూ టీమ్ సాయి బెదిరించినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ డి. పద్మిని వెల్లడించారు. తన పిల్లలను అనాథలుగా చేసి, బొంబాయి ఫుట్‌పాత్‌పై భిక్షాటన చేసే పరిస్థితికి తీసుకొస్తానని కూడా బెదిరించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.
తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఏఐ సాంకేతికతతో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తానని బెదిరించినట్లు పద్మిని తెలిపారు. తన ఫోన్‌ను హ్యాక్ చేశానని, ఎవరితో మాట్లాడుతున్నదీ తనకు తెలుసునని టీమ్ సాయి చెప్పినట్లు వివరించారు. అతడి నంబర్‌ను బ్లాక్ చేసిన తర్వాత కూడా ఇతర వ్యక్తుల ద్వారా తనను సంప్రదించారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ బెదిరింపులు కొనసాగాయని, వాటి కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. తనకు, తన భర్తకు లేదా పిల్లలకు ఏదైనా హాని జరిగితే టీమ్ సాయి, అతడి అనుచరులదే బాధ్యత అని స్పష్టం చేశారు.
టీమ్ సాయి తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నాడని, అయితే అతడి నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని పద్మిని స్పష్టం చేశారు. తాను 24/7 పార్టీ కోసం పనిచేస్తున్నానని, తన సేవలను గుర్తించిన బీజేపీ నాయకత్వం తనకు పదవిని అప్పగించిందని తెలిపారు. తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి ఉంటే ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా, పిల్లల పాఠశాల ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయని, తనకూ అప్పులు ఉన్నాయని పేర్కొంటూ, తనకు అప్పులిచ్చిన వారిని ఇంటికి పంపించి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
టీమ్ సాయితో కొన్నేళ్లపాటు కలిసి పనిచేసిన తాను, అతడి ప్రవర్తన కారణంగా 2026 ఏప్రిల్ 1న అతడికి దూరమైనట్లు పద్మిని తెలిపారు. ఈ వ్యవహారం పార్టీకి సంబంధించిన రాజకీయ అంశం కాదని, తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు తనకు అండగా ఉన్నారని, ఇటీవల పార్టీ నిజనిర్ధారణ కమిటీ తన నివాసానికి వచ్చి వివరాలు సేకరించిందని వెల్లడించారు. బీజేపీ నాయకత్వం కేసు ఉపసంహరించుకోవాలని చెప్పినా వెనక్కి తగ్గబోనని, న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం, 2024 డిసెంబర్ 24, 2025 ఏప్రిల్ 1, ఆగస్టు 9 తేదీల్లో టీమ్ సాయి తన నివాసానికి పిలిపించి బెడ్‌రూమ్‌లోకి రావాలని ఒత్తిడి చేసినట్లు, నిరాకరించడంతో తన భర్తకు, కుటుంబానికి హాని చేస్తానని బెదిరించినట్లు పద్మిని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 1న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తన భర్తతో కలిసి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన సందర్భంలో టీమ్ సాయితో పాటు పాక శివ, రాహుల్, జాన్, ఆదిత్య తనను అవమానించినట్లు ఫిర్యాదులో వివరించారు. తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించాలనుకున్నానని, కానీ తన ఫొటోలను చిన్నగా ముద్రించిందంటూ టీమ్ సాయి వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.
2026 ఆగస్టు 21న రాత్రి 11 గంటలకు, 11.30 గంటలకు జాన్, పాక శివ, రాహుల్ తన ఇంటికి వచ్చి టీమ్ సాయితో మాట్లాడాలని ఒత్తిడి చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కులాన్ని కించపరిచేలా దూషించడంతో పాటు, తనను, తన భర్తను వదిలిపెట్టబోనని, తన రాజకీయ భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తామని బెదిరించినట్లు పద్మిని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 1న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తన భర్తతో కలిసి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన సందర్భంలో టీమ్ సాయితో పాటు పాక శివ, రాహుల్, జాన్, ఆదిత్య తనను అవమానించినట్లు ఫిర్యాదులో వివరించారు. తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించాలనుకున్నానని, కానీ తన ఫొటోలను చిన్నగా ముద్రించిందంటూ టీమ్ సాయి వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.
2026 ఆగస్టు 21న రాత్రి 11 గంటలకు, 11.30 గంటలకు జాన్, పాక శివ, రాహుల్ తన ఇంటికి వచ్చి టీమ్ సాయితో మాట్లాడాలని ఒత్తిడి చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కులాన్ని కించపరిచేలా దూషించడంతో పాటు, తనను, తన భర్తను వదిలిపెట్టబోమని, తన రాజకీయ భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తామని బెదిరించినట్లు వివరించారు. కులపరమైన దూషణలు, లైంగికంగా అవమానించే వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పద్మిని ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో సాయి ప్రసాద్ అలియాస్ టీమ్ సాయి, పాక శివ, రాహుల్, జాన్, ఆదిత్యలపై క్రైమ్ నంబర్ 989/2026గా కేసు నమోదైంది. బీఎన్‌ఎస్ సెక్షన్లు 75, 78, 79, 352, 351(3), 61తో పాటు 3(5), ఐటీ చట్టంలోని 66C, 66E సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని 3(1)(r), 3(1)(s), 3(1)(w)(ii) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీమ్ సాయిపై గతంలో 14 కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీషీట్ కూడా తెరిచారని పద్మిని పేర్కొన్నారు. ప్రస్తుత కేసు అతడిపై 15వ కేసు అని ఆమె తెలిపారు.
అల్వాల్ ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
#Sidhumaroju
Alwal










