శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలు. ఈరోజు మొదటి రోజు కావడం వల్ల ఎంతో రంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.. ఈరోజు అమ్మవారికి అలంకారాలు బాల త్రిపుర సుందరి దేవిగా,శ్రీ భవానీ దేవిగా అలంకరించినారు. దేవస్థాన ఆవరణలో దంపతులచే హోమాలు చేయించడం జరిగినది.దేవస్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర నిమిషాల వరకు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం వారిచే మరియు శ్రీమతి కొండపి వసుంధర బృందం చే అన్నమాచార్యుల సంకీర్తన గానం,రాత్రి 7:30 నుంచి 10 గంటల వరకు శ్రీ లక్ష్మీ నారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ తెనాలి వారిచే శ్రీమతి పెసర్లంక వస వసంత దుర్గ శిష్య బృందం వారిచే కూచిపూడి జానపదా నృత్య ప్రదర్శన జరగనున్నాయి. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని దేవస్థానం కమిటీతోపాటు ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు….
Venkat…. తెనాలి…..










