భారత్ అవాజ్ న్యూస్ :- వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని మూడుచెక్కలపల్లి శివారు బాల్య తండాకు చెందిన రైతు భాజ్యపై కోతుల గుంపు దాడి చేసింది. పంటకు నీళ్లు పెట్టి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన రైతును స్థానికులు కోతుల నుంచి రక్షించి, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము










