పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
9

● అర్హులైన వారందరికీ అవగాహన కల్పించాలి

● బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచన

అల్వాల్,అక్టోబర్26:మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు.

మౌలాలి డివిజన్ పరిధిలోని సాయినాథ్‌పురంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. నమోదు ప్రక్రియ కొనసాగుతున్న తీరును తెలుసుకుని, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని నాయకులకు సూచించారు.

2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పట్టభద్రులు అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అమీన్‌ఉద్దీన్, భాగ్యనందరావు, మారుతి ప్రసాద్, ఆదినారాయణ, నవాబ్, సందీప్, కిరణ్, అనిల్, శ్రీనివాస్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal