గొర్లె సీతారాంపురం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోటిపల్లి మాధవి విజయపురి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరఫున బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఆశీస్సులతో బలపరిచిన తనను ఎంపీటీసీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వరరావు, రాము, సాంబమూర్తి, ఆదినారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.
#RAJESH










