నిజామాబాద్‌లో పగటిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో మొత్తం 11 ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.
నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదు, నేరాలకు ఉపయోగించిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నంబర్ ప్లేట్లతో ఉన్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నిజామాబాద్ పోలీసుల ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.










